పెళ్లి అంటే ఒక బాధ్యత. అది నా వల్ల కాదు: Trisha

Byline :  Bharath
Update: 2024-02-29 12:30 GMT

టాలీవుడ్ పాతుకుపోయిన స్టార్ హీరోయిన్ త్రిష.. తెలుగు స్టార్ హీరోలందరితో నటించి స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టింది. గత కొద్ది కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన త్రిష.. ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ వరుస సినిమాల ఆఫర్స్ తో దూసుకుపోతుంది. చిరంజీవి విశ్వంభర సినిమాలో తిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. 40 ఏళ్లకు చేరువలో ఉన్న త్రిష.. పెళ్లి చేసుకోకుండా హిట్స్ కొడుతూ ఇండస్ట్రీని ఊపుతోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష తన రిలేషన్షిప్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నేను చాలామందితో డేటింగ్ చేశా. రిలేషన్షిప్ కూడా పెట్టుకున్నా. కానీ ఇప్పటివరకు ఎవరితో వర్కౌంట్ కాలేదు. రకరకాల మనస్తత్వాలు ఉన్నవారితో జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండదు. పెళ్లి అంటే ఒక బాధ్యత. అది నా వల్ల కాదు. ఇలాంటి అనుమానాలు ఒక దశలో నాకు చాలా వచ్చాయి. ప్రస్తుతం నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నా. సెల్ఫ్ లవ్ అనే చాలా అద్భుతంగా ఉంటుంద’ని త్రిష చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News