త్రివిక్రమ్ షాకింగ్ డెసిషన్.. Trivikram

Byline :  Babu Rao
Update: 2024-02-17 11:13 GMT

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్న ఏకైక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. పేజీల కొద్దీ డైలాగ్స్ ను బంచ్ ల కొద్దీ పంచ్ లు గా మార్చి ఓ కొత్త ట్రెండ్ నే క్రియేట్ చేశాడు. తర్వాత దర్శకుడుగా మారి అక్కడా తనదైన ముద్రను బలంగా వేశాడు. అయితే కొన్నాళ్లుగా త్రివిక్రమ్ శైలి మారింది. సినిమాలు చేయడం కంటే ‘‘సినిమాలను సెట్ చేయడం’’లోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అంటే తను డైరెక్ట్ చేసే సినిమాలకంటే..ఇతర దర్శకులకు నిర్మాతలను, నిర్మాతలకు దర్శకులకు సెట్ చేస్తూ.. కథలు కూడా వింటూ కథలు విన్నందుకే కోట్లు ఛార్జ్ చేస్తూ.. ఇలా సెట్ చేసినవాటినిక అదనంగా వసూలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. ఈ కారణంగానే తను రాసుకుంటోన్న కథలపై పట్టు తప్పుతున్నాడు. సొంతంగా రాయడం కంటే కాపీలు కొట్టిన వాటితోనే కానిచ్చేస్తున్నాడు. అ ఆ సినిమా మీనా నవల ఆధారంగా రూపొందించాడు. అల వైకుంఠపురములోను ఇంటిగుట్టు సినిమా నుంచి థీమ్ లేపేసి చూపించాడు. చివరగా వచ్చిన గుంటూరు కారణం యద్ధనపూడి సులోచనా రాణి రాసిన కీర్తి కిరీటాలు నవల నుంచి కాపీ కొట్టాడు. దీంతో ప్రేక్షకులు ఈ సారి కాస్త గట్టిగానే విమర్శించారు. ఆ విమర్శలను పర్సనల్ గా తీసుకుని అలిగాడట. పైగా గుంటూరు కారంకు కమర్షియల్ గా భారీ నష్టాలువచ్చాయి. అంతకు ముందు అజ్ఞాతవాసితోనూ ఆ నిర్మాణ సంస్థకు అతి భారీ నష్టాలు మిగిల్చాడు. అలాగే తను ఫైనల్ చేసిన కథతో వచ్చిన రంగ్ దే కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. ఇవన్నీ చూశాక.. త్రివిక్రమ్ తో మాత్రమే సినిమాలు చేస్తాం అని భీష్మించుకున్న హారిక హాసిని బ్యానర్ వాళ్లు రీ థాట్ లో పడ్డారు. త్రివిక్రమ్ ను వదిలించుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇవి తెలిసి తనే సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాననీ, వేరే నిర్మాణ సంస్థలతో టై అప్ అవుతున్నాననే వార్తలు స్ప్రెడ్ అయ్యేలా తన పీఆర్ టీమ్ తో వార్తలు రాయించుకుని హారిక హాసిని వారి నిర్ణయానికి చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశాడనే ఆరోపణలున్నాయి. ఓ రకంగా సినిమా దర్శకుడుగా, రచయితగా త్రివిక్రమ్ బాగా ‘‘రిలాక్స్’’ అయ్యాడు అని చాలామంది చెప్పుకుంటారు. ఇలా రిలాక్స్ అయిన వాడికి ఏదైనా సాధించాలని, ఒక పెద్ద హిట్ కొట్టాలనే కోరిక బలంగా ఉండదు. అందుకే వెండితెరపై వీక్ నెరేషన్స్ చేస్తున్నాడు త్రివిక్రమ్.

మరోవైపు గుంటూరు కారం సినిమా గురించి పరుచూరి పలుకులు అనే కాన్సెప్ట్ లో యూ ట్యూబ్ వీడియోలు చేసే గోపాలకృష్ణ కాస్త గట్టిగానే చురకలు అంటించాడు. ఇవన్నీ కలిపి త్రివిక్రమ్ ను తీవ్రంగా డిస్ట్రబ్ చేశాయట. అందుకే ఇకపై దర్శకత్వం చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అతను మాటల రచయితగానే కెరీర్ ప్రారంభించాడు. మళ్లీ ఆ కెరీర్ ఆరంభాన్నే కొత్తగా మొదలుపెట్టి ఇకపై వేరే సినిమాలకు మాటలుమాత్రమే రాయాలని.. అవకాశాలు లేకపోతే అసలు పరిశ్రమనే వదిలిపోవాలనే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ అంతా గాసిస్పై కూస్తోంది. విశేషం ఏంటంటే.. పెద్ద సక్సెస్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా.. త్రివిక్రమ్ కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించడు. ఇది ఫస్ట్ మూవీ స్వయంవరం నుంచీ ఉంది. స్వయం వరం బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సడెన్ గా భీమవరం వెళ్లిపోయి.. ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకున్నానని.. చాలామంది తనను అప్రోచ్ అవడానికి ప్రయత్నించినా పట్టించుకోలేదనీ.. మళ్లీ నువ్వే కావాలితోనే రీ ఎంట్రీ ఇచ్చానని తీనే చెప్పుకుంటాడు. బట్ ఈ సారి దెబ్బ గట్టిగా తగిలింది కదా.. అందుకే నిర్ణయం కూడా స్ట్రాంగ్ గానే తీసుకున్నాడట. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో కూడా ఉన్నాడనే అనూహ్యమైన వార్తలు వస్తున్నాయి. మరి ఇవి నిజమా కాదా అనేది చూడాలి. 

Tags:    

Similar News