సోషల్ మీడియాలో తనను సింపతీ స్టార్ అనడంపై సమంత స్పందించారు. యశోద, శాకుంతలం సినిమాల సమయంలో తన హెల్త్ గురించి బయటపెట్టినందుకు సింపతీ స్టార్ అన్నారని, అందుకు తాను చాలా బాధపడ్డానని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడ్డానన్నారు. ముఖ్యంగా ట్రోలర్స్ చేసే కామెంట్స్ తట్టుకోలేకపోయానన్నారు. దయచేసి తనని సింపతీ స్టార్ అనొద్దని, ఇకనైనా ట్రోల్స్ ఆపండంటూ సమంత రిక్వెస్ట్ చేశారు.
ప్రస్తుతం సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. హెల్త్ మీద ఫోకస్ చేయడానికి సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు తానే స్వయంగా చెప్పింది. తన ఆరోగ్యం చూసుకుంటూ, దేశ విదేశాలు తిరుగుతోంది. మాయోసైటిస్ వ్యాధి నుంచి సమంత ఆల్రెడీ కొంత వరకూ కోలుకుంది. త్వరలోనే సామ్ నటించిన సిటాడెల్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఆ సిరీస్ తర్వాతే సమంత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనుంది.