బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు కోర్టులో ఊరట

By :  Vamshi
Update: 2024-02-21 16:24 GMT

బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరాట లభించింది. పోలీసుల ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటివేషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రశాంత్ అతని సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన అనంతరం పల్లవి ప్రశాంత్ విజేత ట్రోఫీతో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి వచ్చాడు.

అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు అతడిని ఊరేగింపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం కావడానికి కారకులయ్యారంటూ పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏ1గా పల్లవి ప్రశాంత్, ఏ2గా అతడి సోదురుడు మనోహర్, ఏ3గా వినయ్ లను చేర్చారు. డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, మనోహర్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.



Tags:    

Similar News