Twitter talk: ఆదిపురుష్‌కి అదే మైనస్.. ప్రభాస్ మెప్పించాడు కానీ....

Twitter talk: ఆదిపురుష్‌కి అదే మైనస్.. ప్రభాస్ మెప్పించాడు కానీ....;

Update: 2023-06-16 02:09 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య ఈ పౌరాణిక చిత్రం ఈ రోజు విడుదలైంది. ఆదిపురుష్ మూవీ ప్రీమియర్స్ ముగియగా.. సినిమా చూసిన ఆడియన్స్ ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొందరు ఆదిపురుష్ ని తిరుగులేని సినిమా అంటున్నారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ నటన అద్భుతం, విఎఫ్ఎక్స్ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. రాముడిగా ప్రభాస్ మెప్పించాడని అంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ సక్సెస్ అయ్యారని, ముఖ్యంగా జై శ్రీరామ్ సాంగ్ ఆకట్టుకుందని అంటున్నారు.




 



ఇదే సమయంలో సినిమాపై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. టీజర్ గురించి అనుకున్నట్లే పలువురు ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా పూర్‌గా ఉన్నాయని అంటున్నారు. రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసినప్పడు వీఎఫ్ఎక్స్ మీద అంతగా ఎందుక కాన్సన్ట్రేట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే లంకేశ్వరుడిగా సైఫ్ లుక్ బాలేదని చెబుతున్నారు. డైరెక్టర్ ఓం రౌత్.. హాలీవుడ్ చిత్రాల్లోని విలన్స్ ని స్ఫూర్తిగా తీసుకుని లంకేశ్వరుడు పాత్రను డిజైన్ చేసి ఉంటారని సెటైర్లు వేస్తున్నారు. ఆదిపురుష్ లో సైఫ్ లుక్.. రామాయణంలోని రావణుడిని చూసిన భావన కలగదంటున్నారు. సినిమాకు ఇది అతి పెద్ద మైనస్ అని చెబుతున్నారు.





మొత్తంగా ఆదిపురుష్ మూవీపై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది. కొందరు ఆడియన్స్ అన్ని విధాలుగా ఆదిపురుష్ మూవీ అబ్బురపరిచిందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో సెకండ్ హాఫ్ బాలేదని, స్క్రీన్ ప్లే నెమ్మదించిందంటున్నారు. పూర్ గ్రాఫిక్స్ , రాముడు, సీత, రావణుడి పాత్రల లుక్స్ అస్సలు బాగోలేదని మండిపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు తెల్లవారుజామునుంచే ప్రీమియర్స్ ప్రదర్శన జరుగుతుంది. పూర్తి రివ్యూ వస్తే కానీ ఆదిపురుష్ ఫలితం మీద ఓ నిర్ణయానికి రాగలం. ట్విట్టర్ టాక్ అయితే ఇది.




Tags:    

Similar News