సలార్ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన సినిమాలు!

By :  Bharath
Update: 2023-09-12 11:15 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా సలార్ సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ ఏడాది క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సినిమా ఎడిటింగ్ వర్క్ మిగిలి ఉందని, దాంతో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వార్తపై క్లారిటీ రాక మిగతా ప్రొడ్యూజర్ లు తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలు సలార్ ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గాయి. తమ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నాయి.

కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకు ప్రకటించారు. అయితే అదే డేటున సలార్ విడుదల ఉండటంతో.. రిలీస్ పోస్ట్ పోన్ చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 6న విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో పాటు మ్యాడ్ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను కల్యాణ్ శంకర్ తెరకెక్కించారు. మొదట సెప్టెంబర్ 1 విడుదల అనుకున్నారు. తర్వాత సెప్టెంబర్ 28కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా సెప్టెంబర్ 28న రామ్ పోతినేని సినిమా స్కంద, రాఘవ లారెన్స్ చంద్రముఖి2 కూడా విడుదల అవుతున్నాయి.



Tags:    

Similar News