గర్భవతుడి ఎంజాయ్.. మిస్టర్ ప్రెగ్నెంట్ నుంచి సూపర్ సాంగ్ విడుదల

Update: 2023-08-12 10:44 GMT

మగాడికి కడుపుస్తే ఎలా ఉంటుంది? నవమాసాలు మోసి ప్రాణాలకు తెగించి బిడ్డను కంటే ఎలా ఉంటుంది? ఈ కాన్సెప్టుతో అందర్నీ ఆకట్టుకునేలా రూపొందించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ మూవీని నవరసాలు జోడించి తీశారు. ఈ నెల 18న విడుదల కానున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రచారంలో భాగంగా శనివారం మూవీలోని ‘ఉల్టా పల్టా ధూము ధాము’ పాటను విడుదల చేశారు. హీరో గర్భం దాల్చితే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆకట్టుకునేలా ఈ పాటలో చూపారు. వాంతులు చేసుకోవడం, మామిడికాయలతోపాటు ఇష్టమైన తిండి తింటూ జాలీగా ఎంజాయ్ చేయడానికి గమ్మత్తుగా చూపించారు.




 


‘‘వచ్చిందయ్యో కొత్త చాన్సు ఇంతకు ముందు లేని డేసు

ఇక టెన్షన్‌కే హాలిడేసు ప్రతి రోజూ ట్విస్టేరా

కోరిందయ్యో టంగు నేడు పులపుల్లంగా వింత కొత్త టేస్టు

ఫ్రీడమ్‌తో నచ్చింది అడిగి దూసుకుపోతుంటే.. అరె ఉల్టా పల్టా ధూము ధాము ’’

అంటూ సాగే ఈ పాటను ప్రఖ్యాత గాయకుడు బాబా సెహెగల్ ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ ఈ పాటను రాయగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ రేయాన్ ‘గర్భవతుడి’గా ఫీలింగ్స్ పక్కగా చూపాడు. ఈ చిత్రంలోని ‘హే చెలీ’ వంటి పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి. రూపా కొడవాయుర్ హీరోయిన్ కాగా సుహాసిని, రాజారవీంద్ర, బ్రహ్మాజీ తదితరులు నటించారు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంతో తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ను మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఇందులో ఇది మామూలు సినిమా కాదని, చూసిన ప్రేక్షకులందరూ తమ తల్లులకు పాదాభివందనం చేస్తారని మూవీ టీమ్ చెబుతోంది. వింత కథతో నవ్వించడంతోపాటు చక్కని ప్రేమకథ దీనికి హైలెట్. మైక్ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.


 

Full View



Tags:    

Similar News