టాలీవుడ్‌లో ఇంతవరకూ తెరకెక్కని ఆసక్తికరమైన కథతో వస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చే మాతృమూర్తులకు సలాం చేస్తూ రూపొందించిన ఈ మూవీ ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్రంలోని పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి. గాజా మరో పాటను మూవీ టీమ్ రేపు(శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనుంది. ‘ఉల్టాపల్టా.. ’ అంటూ సాగే ఈ పాటను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేయనున్నారు. ప్రఖ్యాత గాయకుడు బాబా సెహెగల్ పాడగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘హే చెలీ’ పాటు యువతను ఊర్రూతలూగిస్తోంది.‘బిగ్ బాస్’ ఫేమ్ సోహేల్ హీరోగా, రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. చిత్రం ఈ నెల 18న శుక్రవారం విడుదల కానుంది. ఇందులో సుహాసిని, రాజారవీంద్ర, బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఇది మామూలు సినిమా కాదని, చూసిన ప్రేక్షకులందరూ తమ తల్లులకు పాదాభివందనం చేస్తారని మూవీ టీమ్ చెబుతోంది. వింత కథతో నవ్వించడంతోపాటు చక్కని ప్రేమకథ దీనికి హైలెట్. మైక్ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.