Wedding :వచ్చే నెలలోనే వరుణ్, లావణ్యల పెళ్లి వేడుక
కొణిదెల వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే ప్రేమించుకొని ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్(Varun tej)- లావణ్య త్రిపాఠి (Lavanya tripati) ల జంట ఈ ఏడాదిలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఇటీవల ఇరువురికి పెళ్లి ఖరారైంది. జూన 9న ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేది ఇంకా వెల్లడించలేదు కానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి.శుక్రవారం రాత్రి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్, ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇందులో చిరంజీవి, నాగబాబు కుటుంబ సభ్యులతోపాటు చిరు చెల్లెళ్లు, మేనల్లుళ్లు సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్ తేజ్‌లతోపాటు అల్లు శిరీష్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక వీరి పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన విషయాలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది కొణిదెల వారి కోడలు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ , వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అంతేకాకుండా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. పెళ్లి ఎక్కడ అన్నది క్లారిటీ ఇచ్చేశారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టస్కనీ.. మేం వచ్చేశాం అంటూ రాసుకొచ్చారు. ఇటలీ మధ్య ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా టస్కనీ ప్రఖ్యాతిగాంచింది. టస్కనీ రాజధాని ఫ్లోరెన్స్ అపురూప శిల్పకళా సంపదకు నిలయంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ ఎల్బా ప్రాంతంలోని బీచ్ లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇక అక్కడే వరుణ్, లావణ్య వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
వరుణ్‌తేజ్, లావణ్య కలిసి 'మిస్టర్' చిత్రంలో నటించారు. తదుపరి వీరిద్దరి కలయికలో 'అంతరిక్షం’ చిత్రం తెరకెక్కింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల అంగీకారంతో లావణ్య, వరుణ్‌తేజ్ త్వరలో మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఇప్పటికే స్పెయిన్‌లో వరుణ్ బ్యాచలర్ పార్టీ ఇచ్చారు. ఇప్పుడు చిరు ఇంట ప్రీ వెడ్డింగ్ పనులు షురూ అయ్యాయి. నవంబర్ మొదటివారంలో వరుణ్‌తేజ్ - లావణ్యల పెళ్లి జరగనుందని తెలుస్తోంది.