Upasana Konidela : విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. ఉపాసన ఏమన్నారంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం పేరుతో నూతన పార్టీని స్థాపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని.. అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామన్నారు. ఇక విజయ్ రాజకీయ ప్రవేశంపై మెగా కోడలు ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మార్పు కావాలి అనుకున్నప్పుడు నాయకుడు ఎవరనేది చూడకుండా సపోర్ట్ చేయాలని ఉపాసన అన్నారు. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే వెనక్కి మాత్రం లాగకండి అని అన్నారు. ‘‘ విజయ్ తన మూవీస్ తో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకోవడం గొప్ప విషయం. ఒక కొత్త నాయకుడిని సపోర్ట్ చేసినప్పుడే మార్పు వస్తుంది. ఆ మార్పు తమిళనాడులోనూ వస్తుందని ఆశిస్తున్నా’’ అని ఉపాసన అన్నారు. రజినీ కాంత్ సహా పలువురు ప్రముఖులు సైతం విజయ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.