Upasana : ఆసక్తికర ఫొటో పోస్ట్‌ చేసిన ఉపాసన

Byline :  Vamshi
Update: 2024-02-12 14:24 GMT

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఆసక్తిర ఫోటో పంచుకున్నారు. ఆ పోటోలో ఉపాసనతో పాటు క్లీంకారను ఎత్తుకున్న ఉపాసన చెల్లెలు అనుష్పాల కామిని, ఆమె భర్త ఆర్మాన్ ఇబ్రహీం కూడా ఉన్నారు. అంతే కాకుండా అనుష్పాల చేతిలో ఒక పాప ఆమె భర్త చేతిలో మరోక బిడ్డ ఉండే ఫోటోను ఉపాసన ట్వీట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గతేడాది జూన్‌లో పండంటి బిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. చరణ్-ఉపాసన కపుల్స్ ఇంత వరుకు క్లీంకార ముఖాన్ని చూపించలేదు. అనుష్పాల, ప్రముఖ కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంల పెళ్లి 2021లో జరిగింది. ఈ ఏడాది జనవరి 23న అనుష్పాల పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది.

ఘనంగా నిర్వహించిన బారసాల కార్యక్రమానికి ఉపాసన, రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోనే ఉపాసన తాజాగా పంచుకున్నారు. ఉపాసన రాంచరణ్ దంపతులు పెళ్లి చేసుకున్న పది సంవత్సరాలకు పిల్లలను ప్లాన్ చేశారు. ఈ దంపతులకు గత ఏడాది జూన్ నెలలో చిన్నారి క్లీన్ కారా జన్మించారు. ఈమె జన్మించి దాదాపు 8 నెలలు అవుతున్న ఇప్పటివరకు తను ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం అభిమానులకు చూపించలేదు.ఇక ఈ చిన్నారికి లలిత సహస్రనామాలలో ఒకటైన క్లీన్ కారా అనే పేరుతో నామకరణం చేశారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన తన కుమార్తె గురించి పలు విషయాలు వెల్లడించారు తన ఇంట్లో క్లిన్ కారాను ముద్దుగా తాను కారా అని పిలుచుకుంటాను అంటూ ఉపాసన తెలిపారు. ఇలా ఉపాసన చేసిన ఈ మాటలను బట్టి చూస్తే క్లీన్ కారా ముద్దు పేరు కారా అని తెలిసి అభిమానులు ఈ పేరును మరింత వైరల్ చేస్తున్నారు.

Tags:    

Similar News