National Film Awards ఉప్పెన, ఆర్ఆర్ఆర్ మూవీలకు జాతీయ అవార్డులు
By : Mic Tv Desk
Update: 2023-08-24 12:40 GMT
ఉప్పెన మూవీ జాతీయ అవార్డును సాధించింది. 2021 ఏడాదిగానూ 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన ఎంపికైంది. ఉత్తమ సంగీత దర్శకులుగా పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్, ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణిలకు జాతీయ అవార్డు దక్కింది. కొండపొలంలోని దమ్ దమ్ పాటకు చంద్రబోస్కు బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు వచ్చింది.
ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్(ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ శ్రీనివాస్ (ఆర్‌ఆర్‌ఆర్) లకు అవార్డులొచ్చాయి. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్ధమ్, ఉత్తమ గుజరాతీ చిత్రం ‘ఛల్లో’ (భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్‌కు వెళ్లింది), ఉత్తమ కన్నడ చిత్రంగా ‘777 చార్లీ’, ఉత్తమ మలయాళీ చిత్రంగా ‘హోమ్’ ఎంపికయ్యాయి.