'నాపై దాడి చేశారు'.. వనితా విజయ్ కుమార్ ఇన్‌స్టా పోస్ట్
'నాపై దాడి చేశారు'.. వనితా విజయ్ కుమార్ ఇన్‌స్టా పోస్ట్;
సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి వనితా విజయ్ కుమార్.. పరిచయం అక్కర్లేని పేరు. చేసిన సినిమాల సంగతేమో కానీ.. పర్సనల్ లైఫ్ లో జరిగిన కీలక పరిణామాల వల్ల సెలబ్రిటీగా మోస్ట్ పాపులర్ అయింది. ఈ మధ్యే వచ్చిన సీనియర్ యాక్టర్ నరేష్ , పవిత్ర లోకేష్ లు నటించిన 'మళ్లీ పెళ్లి' లో ఓ మెయిన్ రోల్ చేసింది వనితా విజయ్ కుమార్. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమా చేయలేదు. అయినా కూడా ప్రేక్షకులను సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూనే ఉంది. అయితే ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ సీనియర్ బ్యూటీ ఇప్పుడు మరోసారి కాంట్రవర్సీని క్రియేట్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
విషయమేంటంటే.. వనిత కూతురు జోవిక ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ షో లో కంటెస్టెంట్‌గా, మరో కంటెస్ట్ంట్ ప్రదీప్‌కు గట్టి పోటీ ఇస్తుంది. షో లో జోవిక ఉంటే.. ఆమె కోసం బయట వనిత సపోర్ట్‌గా నిలిచింది. తన కూతురు ఏం చేసినా కూడా మద్దతుగా నిలుస్తోంది. ఇక జోవికకు, ప్రదీప్ ఫ్యాన్స్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. వనిత కూడా ప్రదీప్ ఫ్యాన్స్ మీద కామెంట్లు చేస్తుంటుంది. అయితే ఆ కామెంట్స్ వల్లే ఆమె మీద తాజాగా దాడి జరిగిందని, దానికి కారణం ప్రదీప్ ఫ్యాన్స్ అని కొంత మంది భావిస్తున్నారు.
https://www.instagram.com/p/C0GC7gXIMJa/?utm_source=ig_web_copy_లింక్
దీనిపై ఇన్ స్టాలో పోస్ట్ చేసింది వనిత. నా మీద జరిగిన దారుణమైన దాడి గురించి ధైర్యంగా పోస్ట్ వేస్తున్నా.. బిగ్ బాస్ షో అనేది కేవలం ఆట.. ఇలా మీరు దాడి చేయడం, హింసను సృష్టించడం సరైన పద్దతి కాదు అంటూ వనిత పోస్ట్ వేసింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 'ప్రదీప్ ఫ్యాన్స్ ఇలా చేసి ఉంటారు' అని కొంత మంది.. 'వాళ్లే చేసి ఉంటారని ఎలా చెప్పగలరు.. ఆమెకు ప్రపంచంలో ఎంతో మందితో గొడవలున్నాయి. ఎవరు ఆమె మీద దాడి చేశారో.. మీరు ఎలా చెప్పగలరు' అంటూ మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.