పేరుకు తగ్గట్టు పెళ్ళి...పెద్ద ప్లానింగ్ లో ఉన్న వరుణ్, లావణ్య

Update: 2023-08-01 10:34 GMT

ఏడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా బాగా మేనేజ్ చేశారు. మొన్న జూన్ లో నిశ్చితార్ధం జరుగుతుంది అనగా ఈ విషయం బయటపడింది. అప్పుడు కూడా మీడియాలో న్యూస్ ఎక్కువగా చక్కర్లు కొట్టకుండా వెంటనే ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నారు. అయితే పెళ్ళి గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.

ఇప్పుడు వీరి పెళ్ళి ఇటలీ లో జరగనుందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. మిస్టర్ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళిన వరుణ్, లావణ్య అక్కడే స్నేహితులుగా మారారని తెలిసింది. అది కాస్తా ఆ తర్వాత ప్రేమగా మారిందిట. అందుకే ఈ జంట కలిసి చోటే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ఫెయిరీ స్టైల్లో వరుణ్-లావణ్యలు వివాహం చేసుకోనున్నారని టాక్. రాజరిక పద్ధతిలో...రస్టిక్​ వెన్యూలో పెళ్ళి జరుగనుందని చెబుతున్నారు. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత దగ్గర సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.కేవలం 50 మంది గెస్ట్ లనే ఆహ్వానించనున్నారట.

పెళ్ళి అయిపోయాక హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ అయితే ఏర్పాటు చేస్తారుట. దానికి సినీ, రాజకీయ ప్రముఖులు అందరినీ పిలుస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News