Varun Tej and Lavanya Tripathi Marriage : వరుణ్‌-లావణ్యల పెళ్లి వేడుక.. ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-02 05:13 GMT

మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. టస్కానీ వేదికగా బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు, తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వేడుకగా వీరి వివాహం జరిగింది. క్రీమ్‌ గోల్డ్‌ షేర్వాణిలో వరుణ్‌ తేజ్‌, కాంచీపురం చీరలో లావణ్య త్రిపాఠి జంట మెరిసిపోయింది. ఈ పెళ్లిలో మెగా, అల్లు కుటుంబాల సందడి మామూలుగా లేదు. పెళ్లి వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, వైష్ణవ్‌ తేజ్‌, హీరో నితిన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.




 


పెళ్లి వేడుకలో మెగా హీరోలంతా ఒకే చోట చేరి ఫోటోలకు ఫోజులిచ్చారు. చిరంజీవి(Chiranjeevi) తన ట్విట్టర్ వేదికగా ఈ సూపర్ పిక్‌ను అభిమానులతో పంచుకున్నారు. వరుణ్-లావణ్య(VarunLav) పెళ్లి తర్వాత మెగా హీరోలంగా కలిసి తీసుకున్న పిక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక ఇందులో చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ కనిపించారు. అందరు గ్రాండ్‌ డ్రెస్‌లో కనిపిస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం సింపుల్‌ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ‘‘ వారు ప్రేమతో నిండిన కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. స్టార్ కపుల్‌కు శుభాకాంక్షలు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక ఈ పెళ్లిలో చిరంజీవి దంపతుల ఫొటో సైతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో రామ్‌చరణ్-ఉపాసన(Ramcharan-Upasana)ల గారాల పట్టి క్లీంకార(Klinkaara)ను ఎత్తుకొని తాతయ్య, నానమ్మలు అయిన చిరంజీవి, సురేఖ దంపతులు ఆనందపడిపోతూ కనిపించారు. సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోతున్న చిరంజీవి దంపతులు మనవరాలిని ఒళ్లో కూర్చొబెట్టుకుని ఆడిస్తుండటం ముద్దుగొలుపుతోంది. నూతన వధూవరులైన వరుణ్‌-లావణ్యకు ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరి రిసెప్షన్‌ ఈ నెల 5న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఎన్‌-కన్వెన్షన్‌ వేదికగా జరగనుంది.




 



 






Tags:    

Similar News