మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది. జూన్ 9న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ జరగగా మరికొన్ని రోజుల్లో వారు పెళ్లి పీఠలెక్కనున్నారు. నవంబర్ 1న డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఈ జంట రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వరుణ్- లావణ్య తమ పెళ్లి పనుల్లో మునిగిపోయారు.
హైదరాబాద్లోని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా షో రూంలో ఈ జంట సందడి చేసింది. పెళ్లి షాపింగ్ కోసం వీరు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన డ్రెస్సులను మనీష్ మల్హోత్రాతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసి వీరి తెగ మురిసిపోతున్నారు.
2017లో వచ్చిన మిస్టర్ సినిమాతో మొదలైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అంతరిక్షం సినిమా సమయంలో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చాలా పార్టీల్లో ఈ లవ్ బర్డ్స్ జంటగా కనిపించారు. కానీ బయట కలిసి కనిపించింది చాలా తక్కువే. కాగా వరుణ్ తేజ్ ఇటీవలే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం వరుణ్ ఓ కొత్త దర్శకుడుని పరిచయం చేస్తూ ఆపరేషన్ వాలెంటైన్ అనే ఏయిర్ ఫోర్స్ బ్యాక్‌గ్రాప్‌లో సినిమా చేస్తున్నాడు. ఇక లావణ్య థనల్ అనే తమిళ సినిమా చేస్తుంది. అథర్వ మురళి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను రవింద్ర మాధవ డైరెక్ట్ చేస్తున్నాడు.
The wedding prep begins for the Mega Wedding❤️🔥
— Varun Tej Fans (@VarunTejFans) September 16, 2023
Mega Prince #VarunTej & #LavanyaTripathi Spotted at @MMalhotraworld for their wedding outfit trails, Specially designed by @ManishMalhotra💥@IAmVarunTej @Itslavanya #VarunLav pic.twitter.com/r8fjtsypOe