ఎంగేజ్మెంట్ తర్వాత ఫారెన్ టూర్కు చెక్కేసిన లవ్ బర్డ్స్.. పిక్ వైరల్

Update: 2023-06-14 03:43 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత వరుణ్, లావణ్య ఫారిన్ టూర్‌ చెక్కేశారు. ఫారిన్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. తాజాగా మంగళవారం ఈ లవ్ బర్డ్స్ సోషల్ మీడియాలో ఒకే ఫొటో షేర్ చేసుకున్నారు. అదికాస్తా ఇంటర్నెట్లో వైరల్గా మారింది.

తమను విష్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెబుతూ లావణ్య షేర్ చేశారు. వరుణ్‌ కూడా అదే క్యాప్షన్‌తో ఆ పిక్ షేర్‌ చేశాడు. అందులో లావణ్య.. వరుణ్‌ తేజ్‌ చేయి పట్టుకుని చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. ఇది చూసిన అభిమానులు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.


తమ మధ్య రిలేషన్‌షిప్ ఉత్త పుకార్లే అంటూ కొట్టిపారేసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ.. చివరికి నిశ్చితార్థంతో ఆ వార్తలు నిజమే అని నిరూపించారు. ఈ జంట ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకోబోతోంది. ఈ ఇద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం అనే మూవీల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇదిలా ఉంటే వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. 



Tags:    

Similar News