వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠీ హల్దీ వేడుక.. పిక్స్ వైరల్..
మెగా ఇంట పెళ్లి సందడి మొదలైంది. మరికొన్ని గంటల్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠీలు మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. ఇటలీలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా ఈ టాలీవుడ్ జంట హల్దీ వేడుక సందడిగా జరిగింది. టుస్కానీలో జరుగుతున్న వెడ్డింగ్‌కు మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే వెళ్లారు. వరుణ్ - లావణ్యల హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
టాలీవుడ్ లవ్ బర్డ్స్ నవంబర్ 1 పెళ్లి బంధంతో ఒకటి కానుంది. అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీ జరగగా ఈ రోజు హల్దీ నిర్వహించారు. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి వరుణ్ తేజ్- లావణ్య ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు వెడ్డింగ్ ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన అనంతరం నవంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.