Varun Tej Lavanya: ఇటలీకి బయల్దేరి వెళ్లిన వరుణ్ తేజ్, లావణ్య
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) వివాహ ఘడియలు దగ్గర పడుతున్నాయి. జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వీరు త్వరలోనే పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ క్రమంలో వీరి ప్రీ- వెడ్డింగ్ వేడుకలు సాగుతున్నాయి. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట నవంబర్ 1న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి ఇటలీ వేదిక కానుంది. ఇటలీలోని టుస్కానీ విలేజ్‌లో వీరిద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయానని సమాచారం. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట ఇటలీకి పయనమైనట్లు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడించాడు. రామ్‌చరణ్ (Ram Charan) - ఉపాసన (Upasana) దంపతులు కూడా తాజాగా టస్కానీ చేరుకున్నారు. అక్కడి పరిసరాలను చూపిస్తూ తాజాగా ఉపాసన ఓ ఫొటోని షేర్ చేశారు. డబుల్ రెయిన్ బో (రెండు ఇంద్ర ధనస్సులు), టుస్కానీ అంటూ ఆమె ఒక ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఈ జంట అక్కడికి వెళ్లిందని సమాచారం. గత రెండు, మూడు నెలల ముందే మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబురాలు మొదలయ్యాయి. ఆ మధ్య చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో పాటు రీసెంట్గా ఓ ఫ్యామిలీ పార్టీ కూడా చేసుకుంది. ఈ పార్టీని అల్లు ఫ్యామిలీ హోస్ట్ చేసింది. శనివారం రాత్రి కూడా లావణ్య త్రిపాఠి.. తన ఫ్రెండ్స్ కి బ్యాచులర్ పార్టీ ఇచ్చింది. ఆమె స్నేహితులు నీరజ, నితిన్ సతీమణి షాలినీ, నిహారిక, రీతూవర్మ తదితరులు పాల్గొన్నారు. కాబోయే వధువుకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.