వరుణ్ తేజ్- లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. వేడుక ఎక్కడంటే..?

Update: 2023-07-21 15:37 GMT

ఆరేళ్ళ ప్రేమ కహానీకి శుభం కార్డు వేస్తూ ఇటీవలే.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిలు ప్రైవేట్‎గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. గతకొన్నేళ్లుగా లవ్ జర్నీ చేస్తున్న వరుణ్, లావణ్యల ఎంగేజ్మెంట్ జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. నాగబాబు ఇంట్లో జరిగిన ఈ వేడుకకు.. కొద్దిమంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్‎ అయిపోయింది సరే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని.. ఈ జంట కనిపించిన ప్రతీ చోట్ల ప్రశ్నలు వస్తున్నాయి.

ఎట్టకేలకు వీళ్ల పెళ్లికి ముహూర్తం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ఆగస్టు 24న పెద్దల సమక్షంలో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. ఈ వేడుక ఇటలీలో ఘనంగా జరుగుతుందని మెగా కాంపౌండ్ దాటి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విదేశాల్లో చక్కర్లు కొడుతున్న వరుణ్, లావణ్య.. పెళ్లి షాపింగ్ చేస్తున్నారని టాక్.

Tags:    

Similar News