Venkaiah Naidu: పద్మవిభూషన్ అవార్డ్ రావడంపై స్పందించిన వెంకయ్యనాయుడు

Byline :  Bharath
Update: 2024-01-26 03:13 GMT

కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతిగా సేవలు అందించిన వెంకయ్య నాయడికి దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. ప్రజా వ్యవహారాల విభాగం కింద ఆయనను ఈ పురస్కారానికి ఎంపికచేశారు. కాగా అవార్డ్ రావడంపై సోషల్ మీడియా వేదికగా వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ పురస్కారం అందడంపై గౌరవంగా ఉన్నానని, ఈ అవార్డును రైతులు, మహిళలు, యువకులు, భారతదేశంలోని పౌరులందరికీ అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా.. తాను తన సేవలను ప్రజలకు కొనసాగిస్తున్నానని అన్నారు. ఈ గౌరవం జాతీయ స్థాయిలో తన పాత్రపై మరింత స్పృహను కలిగిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఈ సంవత్సరానికి గానూ.. 132 మందికి పద్మ అవార్డులకు ఎంపికచేసింది. ఈ జాబితాలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు ప్రతిష్టాత్మక అవార్డ్ భారతరత్న వరించింది.





Tags:    

Similar News