దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. వెంకీమామ రెండో కూతురి నిశ్చితార్థం

Byline :  Veerendra Prasad
Update: 2023-10-26 08:50 GMT

టాలీవుడ్‌ సీనియర్ హీరో వెంకటేశ్‌ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమార్తె హయవాహిని నిశ్చితార్థం బుధవారం జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడితో వెంకటేశ్​ స్వగృహంలోనే ఈ వేడుకను నిర్వహించారు. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగ చైతన్య ఈ నిశ్చితార్థానికి హాజరై సందడి చేశారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.




 


మొదటి నుంచి వెంకటేశ్‌ తన ఫ్యామిలీ వ్యవహారాలను ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడతారు. ఇప్పుడు తన కూతురి ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని సైతం మీడియాకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అయినప్పటికీ ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి




 


కాగా, వెంకటేశ్‌, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయ వాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి 2019లో జరిగింది. ఆశ్రిత పెళ్లి తరువాత ఒక ఫుడ్ బ్లాగర్ గా మారారు. హయవాహిని ఒక అథ్లెట్ అని సమాచారం. ఇక వెంకీ మామ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమాతో వెంకటేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.




 





Tags:    

Similar News