విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి..రేపు చిన్న కూతురి వివాహం

Byline :  Vamshi
Update: 2024-03-14 11:45 GMT

టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని మార్చి15వ తేదీన వివాహం చేసుకోబోతున్నారు. కాగా ఈ శుభకార్యానికి రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. హయవాహినికి గతేడాది ఆక్టోబరులో విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌తో నిశ్చార్థం జరిగింది.అయితే ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.తన పిల్లల విషయంలో లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు వెంకటేశ్.

వాళ్లను సెలబ్రిటీలుగా కాకుండా, సామాన్యులుగా పెంచారు. తమ నిర్ణయాలు తామే తీసుకునేలా, తమ కెరీర్ ను తామే ఎంచుకునేలా ప్రోత్సహించారు. వెంకటేష్ కు నలుగురు పిల్లలు. వీళ్లలో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె ఆశ్రిత 2019లో వినాయక్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ వివాహానికి జైపూర్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఇప్పుడు రెండో కూతురు పెళ్లి చేస్తున్నారు.టాలీవుడ్‌ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ అంటే తన అభిమానులకే కాక సాధారణ సినిమా ప్రేక్షకులకు కూడా ఎంతో అభిమానం. ఎలాంటి రిమార్క్ లేకుండా, వివాదాలు లేకుండా 37 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

Tags:    

Similar News