ఆస్తి తగాదాలు..నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ పై కేసు

Update: 2023-07-09 07:24 GMT

తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సొంత కుటుంబ సభ్యులే వారిపై తమిళనాడులోని తిరుచ్చి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తిరుచ్చిలోని లాల్‌కుడి గ్రామానికి చెందిన విఘ్నేశ్‌ తండ్రి శివకు తొమ్మిది మంది సోదరులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం శివ కన్నుమూశారు. అయితే, ఆయన బతికి ఉన్నప్పుడు సోదరులందరికీ చెందిన ఆస్తిని.. ఎవరికీ చెప్పకుండా అమ్ముకుని, ఆ డబ్బులు ఆయన కుటుంబమే వాడుకుందంటూ.. తాజాగా శివ సోదరుడు మాణిక్యం పోలీసులను ఆశ్రయించాడు. విఘ్నేశ్‌ శివన్‌ కుటుంబం సభ్యులంతా కలిసి వెంటనే తమకు ఆ ప్రొపర్టీని రిటర్న్‌ చేయాలని ఆ ప్రాపర్టీని కొనుగోలు చేసిన వారిని డిమాండ్‌ చేశాడు. ఈ మేరకు విఘ్నేశ్‌ శివన్‌, ఆయన తల్లి మీనా కుమారి, చెల్లి ఐశ్వర్య, నయనతారపై ఫిర్యాదు చేశాడు మాణ్యికం. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో వైరల్‌ అవుతోంది. ఏడేళ్ల ప్రేమ అనంతరం విఘ్నేశ్‌ శివన్‌, నయనతారను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. నయన్‌ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది.




Tags:    

Similar News