మొన్న షర్టు, నిన్న శారీ.. స్టేజీ మీదే విప్పేస్తున్నారు.. నెటిజన్ల ట్రోలింగ్

Update: 2023-08-17 03:49 GMT

విడుదల కాబోయే సినిమాను ఎంత కొత్తగా ప్రమోట్ చేస్తే అంతగా జనాల్లోకి వెళ్తుంది. అందరూ తమ తమ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు నానా రకాలుగా పాట్లు పడుతున్నారు. ప్రమోషన్స్ చేస్తున్నారు. పెద్ద స్టార్లు సైతం సోషల్ మీడియాలో వెరైటీగా రీల్స్, షార్ట్స్ చేస్తూ.. సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాలో బాగా పేరొచ్చిన వాళ్లను కూడా వాడుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా జనాల నోళ్లలో నానుతూ తమ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెస్తున్నారు. అయితే ఈ విధానం కాస్త మారుతూ వస్తోంది.




 


మొన్న ఖుషి సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంత రచ్చ చేశాడో అందరికీ తెలిసిందే. స్టేజ్ మీదే షర్ట్ విప్పి.. సమంతతో డ్యాన్స్ చేశాడు. ఇక సమంత, విజయ్‌లు అలా డ్యాన్స్ చేయడం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ అర్థమైంది. ఇప్పుడు విశ్వక్ సేన్, నేహా శెట్టిలు కూడా కాస్త హద్దులు దాటారు. వీరద్దరూ కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి సుట్టంలా సూసి అనే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ పాటను నిన్న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లు స్టేజ్ మీదే నానా హంగామా చేశారు. హీరోయిన్ నేహా శెట్టి స్టేజ్ మీదే హీరోతో కలిసి రచ్చ చేసింది. హుక్ స్టెప్ వేసింది. తన చీరను విప్పి... హీరోకు కప్పి.. ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో మీద నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. స్టేజ్ మీద ఇలాంటి పనులు చేయడం అవసరమా? అంటూ ఫైర్ అవుతున్నారు.




 



Tags:    

Similar News