Vijay Devarakonda : రష్మిక నిన్ను చూసి గర్వపడుతున్నా..విజయ్ పోస్ట్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ మేరకు తనకు దక్కిన ఈ గుర్తింపుపై రష్మిక తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మ్యాగజైన్ కవర్ ఫొటోను షేర్ చేసి తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన 30 ఏళ్లలోపు యువతీయువకులతో ఫోర్బ్స్ పత్రిక..‘30 అండర్ 30’ జాబితాను రూపొందిస్తుంది. ఈ ఏడాది రష్మికతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లకు ఈ లిస్ట్ లో చోటు దక్కింది.
దీనిపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశాడు. రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. పోస్ట్ లో ‘‘నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అటు ఫ్యాన్స్ కూడా నేషనల్ క్రష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, రష్మిక, విజయ్ దేవరకొండ లవ్‌లో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వారి ఎంగేజ్ మెంట్ కూడా కానున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఇరువురు క్లారిటీ ఇచ్చి అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. ప్రతి రెండేళ్లకు ఓసారి మీడియాలో తన పెళ్లి వార్తలు వస్తుంటాయని రష్మిక తెలిపింది.