నా వైఫ్‎తో అలాగే ఉంటా..పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్

By :  Lenin
Update: 2023-07-14 03:42 GMT

లైగర్ ఫ్లాప్ తరువాత లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. సమంత, విజయ్ జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ఖుషి . శివ నిర్వాణ దర్శకత్వంలోమైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్‎గా రిలీజ్ కానుంది. . తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషీ మూవీ విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అంతే కాదు రౌడీ బాయ్ విజయ్ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఇది ఇలా ఉంటే ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను పంచుకునే రౌడీ బాయ్ తాజాగా పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్‎గా మారాయి.

ఖుషి నుంచి రీసెంట్‎గా ఆరాధ్య పాట విడుదలైంది. ఈ పాట ప్రస్తుతం నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. ఎవరి నోట విన్నా ఆరాధ్య..ఆరాధ్య అనే పాటే వినిపిస్తోంది. ఈ సాంగ్‎లో పెళ్లి తర్వాత భార్యా భర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు కొరియోగ్రాఫర్. ప్రేక్షకులే కాదు విజయ్ కూడా ఈ సాంగ్‎కు బాగా కనెక్ట్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే సోషల్‌మీడియా వేదికగా ఈ పాటను ఉద్దేశించి స్పందించాడు విజయ్ దేవరకొండ.

ఖుషి సినిమాలో ఆరాధ్య పాట విన్న ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే విడుదలైన కొద్ది రోజుల్లోనే వైరల్ అవుతోంది. విజయ్ కి రెస్పాండ్ అయ్యాడు. "ఖుషిలో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి తరువాత ఒక సంవత్సరం లోపు దంపతులు ఎలా ఉండాలో చక్కగా చూపించారు. వారి మధ్య రిలేషన్‎ను ఎంతో అందంగా ప్రజెంట్‌ చేశారు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ.. నాకు పెళ్లైన తరువాత, నా భార్యతో ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నాను" అని విజయ్‌ దేవరకొండ చెప్పాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ భయ్యా త్వరగా పెళ్లి చేసుకో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

Tags:    

Similar News