Vijayakanth : ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై విజయకాంత్.. తీవ్ర ఆందోళనలో DMDK కేడర్
తమిళ సినీ నటుడు,డీఎండీకే(దేశీయ మురుపొక్కు ద్రవిడ కళిగం) అధినేత విజయకాంత్ అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు.. తీవ్ర అనారోగ్యం కారణంగా చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందిస్తోన్నట్లు సమాచారం. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో ఆయన అభిమానుల్లో, డీఎండీకే కీలక నేతల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత భుజాన వేసుకుంది.
ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే విజయకాంత్ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి ఆదివారం తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతుంది. ఆయనను అలా చూసిన పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది..
తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా విజయ్ కాంత్ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తమిళంలో 150కిపైగా సినిమాల్లో నటించాడు. 2010 నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు విజయ్ కాంత్. 2005లో డీఎండీకే పార్టీని నెలకొల్పాడు విజయ్ కాంత్.