Naga Chaitanya : ఇన్‌స్టాగ్రామ్‌లో కొటేషన్లు, ఫోటోలు.. ఎవరి కోసం ఇదంతా?
హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత ల జంట విడాకులు తీసుకొని రెండేళ్లు దాటినా.. ఇప్పటికీ వారు మళ్లీ కలుస్తారేమో అన్న సందేహం అటు అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ఇటు సగటు సినీ అభిమానికి సైతం ఉంది.ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న ఈ జంట పెళ్ళైన నాలుగేళ్ళకే మనస్పర్థల కారణంగా విడిపోవడం చాలామందిని బాధించింది. అభిమానులను దీని గురించి ఇకపై ప్రస్తావించొద్దని కోరిన ఈ ఇద్దరూ... ప్రస్తుతంఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే మీడియాలో మాత్రం వీరు మళ్లీ కలిసిపోతున్నారనే వార్తలు అప్పుడప్పుడు పుట్టుకొస్తున్నాయి. వీరు సోషల్ మీడియాలో షేర్ చేసే ట్వీట్‌లు, పోస్టులే అందుకు కారణం. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్య పోస్ట్ చేసిన ఓ ఫొటో.. మళ్లీ ఇలాంటి వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది.
సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు హాష్ అనే పెంపుడు కుక్క(ఫ్రెంచ్ బుల్ డాగ్)ను పెంచుకున్న విషయం తెలిసిందే. ఈ కుక్కతో కలిసి దిగిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసేది. అయితే విడిపోయినప్పటి నుంచి హాష్ సమంతతో ఉంది. గతంలో కొన్నిసార్లు సామ్ ఈ కుక్క ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవల ఈ కుక్కపిల్ల నాగచైతన్యతో కనిపించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ అభిమాని కొత్త బైక్ కొనుక్కొని నాగచైతన్య కలవడానికి వెళ్లగా అక్కడ ఓ కుక్కపిల్ల చైతన్య వద్దకు వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా మరోసారి అదే కుక్క పిల్ల ఫొటోను చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కారులో తీసిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన చై, సామ్ ఫ్యాన్స్ ఈ జంట కలిసిపోయిందంటూ కామెంట్స్ చేసేస్తున్నారు.
ఈ కామెంట్స్ సమంత వరకూ చేరుకున్నాయో.. ఏమో... ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన పోస్ట్ మరో చర్చకు దారి తీసింది. సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ‘దయాగుణాన్ని వ్యూహంగా కాకుండా.. జీవిత మార్గంగా అలవరుచుకునే వారికి హ్యాట్సాఫ్’ అనే కొటేషన్ రాసున్న ఫొటోను షేర్ చేసింది. సమంత చేసిన పోస్ట్ వెనకాల అసలు కారణం ఏంటి.? మళ్లీ ఈ జంట కలిసిపోనున్నారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే ఇలాంటి పోస్ట్ చేసిందా.? అనే చర్చ జరుగుతోంది.
Always Down to Earth!
— Aarya Prasad (@Aaryaprasad) October 2, 2023
Man with a golden heart ❤️❤️
#Yuvasamrat @chay_akkineni pic.twitter.com/chV658qit7