'ఆదిపురుష్ చూశాకే అర్థమైంది'.. వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు

'ఆదిపురుష్ చూశాకే అర్థమైంది'.. వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు

Update: 2023-06-25 05:44 GMT



ఓం రౌత్ డైరక్షన్‌లో భారీ అంచనాలతో జూన్ 16న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్ సినిమాపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విమర్శలతోపాటు వివాదాల్లోనూ చిక్కుకుంటుంది. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ కూడా భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రామాయణాన్ని వక్రీకరించారని, వివాదాస్పద డైలాగ్స్ ఉపయోగించారని, కార్టూన్ మూవీలా ఉందని మరికొందరు.. ఇలా సినిమా చూసినవాళ్లంతా బూతులు తిడుతున్నారు. ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ రామాయణం కథ కాదని.. ఇదొక రోతాయణం అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఈ సినిమాపై సెటైర్లు వేశారు. ఆదిపురుష్ చూశాక.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైంది అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను ఒప్పుకున్నందుకే కట్టప్ప చంపేశాడనే అర్థంలో సెటైర్ వేశారు సెహ్వాగ్. ఇక ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా ఉందని.. దర్శక నిర్మాతలు, రచయితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి అమిత్‌ షా (Amit Shah)కు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ శనివారం ఓ లెటర్ కూడా రాసింది. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విన్నపం చేసింది.


సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆదిపురుష్ రామాయణ కథ అని చెప్పుకొచ్చిన మేకర్స్.. రిలీజ్ అయ్యి విమర్శలు, వివాదాలు ఎదురుకోగానే అసలు ఇది రామాయణమే కాదు అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. రామాయణంలోని పాయింట్స్ తీసుకోని ఆదిపురుష్ అనే సినిమా తీసామంతే అంటూ చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా హనుమంతుడు అసలు దేవుడే కాదంటూ వివాదాస్పద కామెంట్స్ చేసి సినిమాపై మరింత వ్యతిరేకత వచ్చేలా చేసుకున్నారు.




Tags:    

Similar News