విరూపాక్షతో ఊహించని హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది, కొత్త డైరెక్టర్ అయినా ప్రేక్షకులను భయపెట్టి మరీ వారికి బాగా దగ్గరయ్యాడు కర్తీక్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో , స్క్రీన్‌ప్లేతో ఇరగదీశాడు. స్క్రీన్ ప్లే విషయంలో గురువు గారు స్టార్ డైరెక్టర్ సుకుమార్ హెల్ప్ చేసినప్పటికీ ఓవరాల్ క్రెడిట్ మాత్రం కార్తీక్‌దే. అందుకే మూవీ టీమమ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి కార్తీక్ ను ఖుష్ చేసింది.విరూపాక్ష నిర్మాతలు కార్తీక్ కి ఖరీదైన బెంజ్ కారు సీ క్లాస్ మోడల్‌ను బహుమతిగా అందించారు. అందుకు సంబంధించిన పిక్స్‌ను కార్తీక్ తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మన దేశంలో బెంజ్ సీ క్లాస్ మోడల్ కారు ధర రూ. 65 నుంచి 70 లక్షల వరకు ఉంటుంది. ఇలా హిట్ ఇచ‍్చిన డైరెక్టర్‌కు ప్రొడ్యూజర్లు కారుని బహుమతిగా ఇవ్వడం గతంలోనూ చాలాసార్లే జరిగింది. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడి విషయంలో మరోసారి నిర్మాతలు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. తన హిట్‌కు కారకులైన గురువు సుకుమార్ కి, హీరో సాయిధరమ్ తేజ్ తో పాటు నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ -డివిఎల్ ఎన్ ఎస్ గారికి కార్తీక్ కృతజ్ఞతలు తెలియజేసాడు.