అతి భయంకర అఘోరగా విశ్వక్ సేన్

Update: 2024-01-28 12:11 GMT

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, Vs10 వంటి చిత్రాలున్నాయి. వాటిలో 'గామి' సినిమా ఎప్పటి నుంచో సెట్స్‌పై ఉంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ సాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ అతి భయంకర అఘోర లుక్‌లో కనిపించనున్నాడు.

ఫస్ట్ లుక్ డిజైన్ పోస్టర్‌పై 'గామి' మూవీ మేకర్స్ ఓ కొటేషన్‌తో పాటు రిలీజ్ చేశారు. ఆ కొటేషన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అతనికి అతి పెద్ద భయం మానవ స్పర్శ..అలాగే అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే అంటూ పోస్టర్‌పై కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ మూవీపై అంచనాలను పెంచుతోందని చెప్పాలి. ప్రస్తుతం 'గామి' మూవీ మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

'గామి' మూవీకి విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ మూవీని విడుదల చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ మూవీతో పాటు విశ్వక్ సేన్ నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రం కూడా విడుదల కానుంది. అయితే రెండింటిలో ఏది ముందొస్తుందో తెలియదు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. 

Tags:    

Similar News