Vishwak Sen :'బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు.. ' విశ్వక్ సేన్ సంచలన పోస్టు
సినీ పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ఇబ్బందిపెట్టాలనే చూస్తుంటారని సంచలన పోస్ట్ చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అయితే ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశాడా అనే చర్చ జరుగుతోంది. డు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా నేపధ్యంలో విశ్వక్ సేన్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ సంచలన పోస్ట్ షేర్ చేశాడు
‘‘ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దామని అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా, ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా. డిసెంబర్ 8కి వస్తున్నాము. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ మీ నిర్ణయం. ఆవేశానికి లేదా ఇగోకి తీసుకున్న నిర్ణయం కాదు. తగ్గే కొద్దీ మింగుతారని అర్థమైంది. డిసెంబర్ కాకపోతే నేను ప్రమోషన్లలో కనిపించను’’ అని రాసుకొచ్చాడు. అయితే డిసెంబర్ 7,8 తేదీల్లో నితిన్, నాని, వరుణ్ సినిమాలు ఉన్నందున ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాను వాయిదా వేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో విశ్వక్ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బహుశా సినిమా విడుదల తేదీ విషయంలో ఏదైనా జరిగిందా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే డిసెంబర్ కాకుండా జనవరిలో విడుదలయ్యే పరిస్థితి కన్పిస్తోంది. అందుకే విశ్వక్ ఇలా ట్వీట్ ద్వారా ఫైర్ అయినట్టు సమాచారం. ఆ ఇన్‌స్టా స్టోరిలో తొలుత అనుకున్న తేదీకే తమ సినిమా విడుదల అవుతుందని.. అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు విశ్వక్ .
ఫక్తు తెలంగాణ కుర్రోడు విశ్వక్ సేన్, గోదావరి నేపధ్య సినిమాలో చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ కొన్ని యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి ప్రధాన హీరోయిన్ పాత్రల్లో కన్పిస్తారు.