Megastar Chiranjeevi : 'విశ్వంభర' స్టోరీ లీక్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మధ్య మెగాస్టార్ రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాలు చేసేస్తున్నాడు. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రెండు మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే చిరూ చేస్తున్న విశ్వంభరపై ఇప్పుడు మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తోన్న ఈ మూవీ మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. చాలా మంది ఇదొక యోధుడి కథ అని అనుకుంటున్నారు. మరికొందరు ఇదొక సోషియో ఫాంటసీ మూవీ అని చెప్పుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. విశ్వంభరలో చిరుతో పాటు ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా నటిస్తున్నారని తెలిసింది. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో చిరూకు జోడీగా అందాల తార త్రిష నటిస్తోంది. ఆమె మాత్రమే కాకుండా మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఇందులో నటిస్తున్నారట. సురభి, ఇషా చావ్లా, అషికా రంగనాథ్‌లు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. క్రేజీ సీన్స్‌ను మేకర్స్ షూట్ చేశారట. మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిషపై సాగే కొన్ని సీన్లను స్పెషల్ సెట్‌లో షూట్ చేశారట.
విజువల్ వండర్‌గా రాబోతున్న విశ్వంభర మూవీలో చిరంజీవికి సిస్టర్లుగా సురభి, ఈషా చావ్లా, అషికా రంగనాథ్‌లు నటిస్తున్నారట. ఆ ముగ్గురు హీరోయిన్లకు జోడీగా ముగ్గురు యంగ్ హీరోలు ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర స్టోరీ మొత్తం ముల్లోకాల మధ్య సాగుతుందట. ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని, ముగ్గురు హీరోలు, హీరోయిన్ల మధ్య సాగే ప్రేమకథలు ఈ మూవీకి హైలెట్‌గా నిలువనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరు జగదేక వీరుడు అతిలోక సుందరి, యముడికి మొగుడు లాంటి ఫాంటసీ చిత్రాలు తీసి హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు మరోసారి విశ్వంభరతో వస్తున్నారు.
విశ్వంభర మూవీలో చిరు దొరబాబు అనే సామాన్య వ్యక్తిలాగా కనిపిస్తారట. ఒక సామాన్యమైన వ్యక్తి ముల్లోకాలను రక్షించే వీరుడిగా మారుతాడట. ముల్లోకాలకు వీరుడైనప్పటికీ గోదావరి తీరాన్ని అడ్డాగా చేసుకుని చిరు ఉంటాడట. మూవీలో చిరు డైలాగులన్నీ గోదావరి యాసలోనే ఉంటాయట. ఇంటర్వెల్‌కు ముందు చిరుపై ఒక భారీ ఫైట్ సీన్ ఉంటుందని, ఆ సీన్ చూసిన వారికి పూనకాలేనని లీకులు వినిపిస్తున్నాయి. చిరు భీకరమైన పోరాటం సీన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని, అందరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ మెగా మూవీ థియేటర్లలోకి రాకముందే భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.