ఎంటర్టైన్మెంట్ విషయంలో తగ్గేదేలేదంటూ వినూత్న కార్యక్రమాలతో దూసుకెళ్తోంది ఆహా. ఈ ఓటీటీ ద్వారా వచ్చిన చాలా వరకు ప్రోగ్రామ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలా నాన్ స్టాప్ గా విజయవంతంగా ముందుకెళ్తోన్న షోలలో 'తెలుగు ఇండియన్ ఐడల్' ఒకటి. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో అదే జోష్‌లో రెండవ సీజన్‌ను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేసింది ఆహా. ఈ తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలే ఎపిసోడ్‌కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్టుగా వచ్చి రచ్చ రచ్చ చేశారు. బన్నీ ఎంట్రీతో ఫైనల్ ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా సాగింది. ఎంతో ఉత్కంఠతతో పోటా పోటీగా సాగిన ఫైనల్లో విశాఖ అమ్మాయి సౌజన్య భాగవతుల విన్నర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా సైజన్య ట్రోఫీ అందుకుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ 2 ఫినాలేకి గెస్టుగా రావడ చాలా సంతోషంగా, థ్రిల్లింగ్‌గా ఉందని బన్నీ అన్నారు. ఈ షో మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. విన్నర్ సౌజన్యకు ట్రోపీ అందించిన బన్నీ ఆమెకు అభినందనలు తెలిపారు. రెండేళ్ల పాపకు తల్లైనా కూడా సౌజన్య ఎంతో అంకిత భావంతో సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొందని, అయితే అది అంత తేలికైన అల్లు అర్జున్ అన్నారు. ఓ వైపు ఫ్యామిలీని, మరోవైపు మ్యూజిక్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఎంతో డెడికేషన్‌తో పాడిన పాటలే ఆమెను విజేతగా నిలబెట్టాయన్నారు. ఇది చూస్తుంటే సౌజన్య పట్ల నాకు ఎంతో గౌరవం పెరిగిందని తెలిపారు. ఈ సక్సెస్ అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు .
సౌజన్య టైటిల్‌తో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఇక ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన జయరాజ్‌కు రూ.3 లక్షల చెక్‌ను అందించారు. సెకండ్ రన్నరప్‌గా నిలిచిన లాస్య రూ.2 లక్షల ప్రైజ్ మనీ అందుకుంది.