చావు నుంచి తప్పించుకున్నాం.. రష్మిక మందన్న షాకింగ్ పోస్ట్
నటి రష్మిక మందాన ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తంది. దీంతో అరగంట సేపు ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ గడిపామని ఆమె పేర్కొన్నాది. తర్వాత ముంబై విమానశ్రయంలో తిరిగి ల్యాండ్ చేసి మరో ఫ్లైట్‌లో ప్రయాణికుల్ని పంపించారు. దీనిపై రష్మిక ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. విమానంలో నటి శ్రద్దాదాస్‌తో దిగిన సెల్పీ ఫోటో పోస్ట్ చేసింది. దానికి ఈ రోజు చావు నుంచి తప్పించుకుమనన్నామని క్యాప్షన్ పెట్టింది. కాళ్ళు చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. రష్మిక పెట్టిన ఈ పోస్టుకు అర్థం ఏంటో తెలియని ఫ్యాన్స్ చావు నుంచి తప్పించుకున్నాం అనే కామెంట్ చూసి కంగారు పడుతున్నారు. ఈ ఫోటోను చూస్తే శ్రద్ధదాస్ తో రష్మిక జర్నీలో లో ఉన్నట్లు అర్థమవుతుంది. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుంది ఏమో అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అటు శ్రద్ధా దాస్ కూడా సేమ్ ఇదే పోస్ట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో రష్మిక ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటూ రష్మిక పోస్ట్ పై కామెంట్స్ పెడుతున్నారు. రష్మిక మందన ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాల లైన్లో పెట్టింది. అందులో రెండు టాలీవుడ్ నుంచి రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. 'యానిమల్' సక్సెస్ తో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం 'పుష్ప 2', 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉంది. వీటిలో 'పుష్ప2' షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'పుష్ప2' కనుక సక్సెస్ అయితే రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకోవడం ఖాయం. రష్మిక ఫోర్బ్స్‌లో అండర్ 30లో అండర్ 30 జాబితాలోకి ఎక్కిన సంగతి తెలిసిందే. రష్మిక అసలే నేషనల్ క్రష్‌గా అందరినీ ఆకట్టుకుంది. పుష్పలో శ్రీవల్లి, యానిమల్‌లో గీతాంజలి పాత్రలకు ఆమెకు తిరుగులేని క్రేజ్ అండ్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టాయి. ఇక ఈ ఏడాది పుష్ప ది రూల్ మూవీతో ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది. అంతే కాకుండా తెలుగులో మరో లేడీ ఓరియెంటెడ్ కథను కూడా ఓకే చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక చేస్తున్న ఆ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా చకచకా జరుగుతోంది.