సినీ రంగంలో హీరోయిన్స్ కెరీర్ చాలా తక్కువ. గ్లామర్ ఉన్నంత వరకే తెరముందు మెరుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ నటి అయితే కొన్నాళ్లు ఇండస్ట్రీని ఏలవచ్చు. అలా కొంతమంది లాంగ్ కెరీర్ రన్ చేసినవారు లేకపోలేదు. అయితే కొందరు హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఫేడౌట్ అయ్యాక కూడా, అదే గ్లామర్ ను కంటిన్యూ చేస్తుంటారు, కొందరు మాత్రం గుర్తు పట్టలేనంతగా మారిపోతారు. ఇప్పుడు సెన్సేషనల్ హిట్ సాధించిన అనందం సినిమా హీరోయిన్‌ది అదే పరిస్థితి . ఆనందం చిత్రంతో ఆడియెన్స్‌కి బాగా దగ్గరై.. ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో అలరించిన నటి రేఖ చాలా రోజుల తర్వాత తాజాగా ఓ టివి షోలో దర్శనమిచ్చింది. దాదాపు పదిహేళ్ల తర్వాత మళ్లీ తెరపై ఆమె కనిపించడం విశేషం. గతంలో ఓ సారి అలీ షోలో కనిపించ రేఖ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించి షాకిచ్చింది.
అప్పట్లో బొద్దుగా, అందంగా ఉండే రేఖ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా స్క్రీన్ మీద కనిపించింది. ఆమెను ఒక్కసారిగా ఇలా చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇక రేఖ షోకి వచ్చీ రాగానే తనదైన శైలిలో నవ్వులు పూయించింది. జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్‌పై పంచ్‌లు వేసింది. ఇదే సమయంలో ఇంద్రజ మాట్లాడుతూ.. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూడటం ఆనందంగా ఉంది . కానీ ఇలా చూసి ఆశ్చర్యపోయానంటూ చెప్పింది. దీనికి రేఖ వివరణ ఇచ్చింది. అసలు తనకు ఏం జరిగిందో చెప్పింది. అయితే అది మాత్రం స్పష్టంగా చూపించలేదు . రేఖ ఏదో చెప్పినట్టుగా ప్రోమోను ఎడిట్ చేశారు. రేఖకు ఏం జరిగిందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
నటి రేఖ జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలో తనదైన నటనతో మెప్పించింది. ఇరవై ఏళ్ల క్రితం రేఖకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉండేది. ఆనందం సినిమా ఆమెను స్టార్ గా మార్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలు బెడిసికొట్టడంతో ఆమెకు ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. వచ్చిన సక్సెస్‌ను ఆమె సరిగ్గా వాడుకోలేదని ఇండస్ట్రీలో అంటుంటారు. తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయినా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఆఫర్లను దక్కించుకుంది రేఖ. ఇప్పుడు రేఖను ఇలా చూసి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. అప్పుడు రేఖ కాస్త ముద్దు, బొద్దుగానే కనిపించేది. కానీ ఇప్పుడే ఇలా బక్క చిక్కిపోయినట్టుగా చూస్తుంటే ఆమెకు పెద్ద సమస్యలే వచ్చినట్టుగా తెలుస్తోంది.