యానిమల్, సలార్లకు ఏమాత్రం తీసిపోని ‘హనుమాన్’.. రన్ టైం ఎంతంటే..?
‘హను మాన్’ (Hanu Man).. టాలీవుడ్ ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా.. సంక్రాతి పండుగ రేస్‌లో ఉంది. పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి ఇండియన్ ఒరిజినల్ సైపర్ హీరో చిత్రం హనుమాన్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో.. సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ హనుమాన్ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 38 నిమిషాల ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.
హనుమాన్ సినిమా విజువల్ వండర్ గా అద్భుతంగా ఉంది. ఎమోషన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా ఉన్నాయి. కంటెంట్ చాలా కొత్తగా ఉందని సెన్సార్ సభ్యులు అభినందించారు. కాగా ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా యానిమల్ 3:30 గంటల రన్ టైం, ప్రశాంత్ నీల్ సలార్ సినిమా 2: 50 నిమిషాల రన్ టైం ఉండగా.. వాటంత కాకపోయినా, హనుమాన్ కూడా కాస్త ఎక్కువ రన్ టైం ఉందని ఫిల్మ్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. జనవరి 12 రిలీజ్ డేట్ కాగా.. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచింది.