బాబాయ్ బర్త్డే అబ్బాయి మర్చిపోయాడా..? కావాలనే విష్ చేయలేదా..?

Update: 2023-06-11 15:08 GMT

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిన్న (జూన్10) ఘనంగా జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు.. బందు మిత్రులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పకపోవడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్.. బాలయ్య బర్త్ డే మర్చిపోయాడా.. లేక కావాలనే విష్ చేయలేదా.. అనే చర్చలు మొదలయ్యాయి.

గతంలో చాలాసార్లు ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణను విష్ చేశాడు. అయిత, నిన్న విష్ చేయకపోవడంపై ఇటు రాజకీయ పరంగా.. అటు ఇండస్ట్రీ పరంగా చర్చనీయాంశం అయింది. వీళ్లిద్దరి మధ్య ఏం విభేదాలు ఉన్నాయి. శుభాకాంక్షలు చెప్పుకోనంత పెద్ద గొడవ ఏం జరిగిందని ఫ్యాన్స్ లో ప్రశ్నలు రేగుతున్నాయి. అయితే, కళ్యాణ్ రామ్ మాత్రం ‘భగవంత్ కేసరి టీజర్ బాగుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు’అంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఈ ఘటనతో ఎన్టీఆర్, బాలయ్య మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News