Fan’s Demand.. కావాల‌య్యా సాంగ్‌కు అందాల భామ అదిరిపోయే స్టెప్పులు

Byline :  Veerendra Prasad
Update: 2023-08-29 02:55 GMT

జైలర్ మూవీలో త‌మ‌న్నా కావాలయ్యా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి ఆడిపాడిన త‌మ‌న్నా ఈ సాంగ్‌లో హాట్ స్టెప్స్‌తో ఉర్రూత‌లూగించింది. ఈ పాటకు రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ.. నెటిజన్లు చెలరేగిపోతున్నారు. ఆడ, మగ అని తేడా లేకుండా అందరూ ఈ స్పెషల్ సాంగ్ కు క్రేజీ స్టెప్స్ వేస్తున్నారు. ఈ క్రేజీ సాంగ్‌కు ఓ మ‌హిళ స్పైసీ స్టెప్స్‌తో ఇంట‌ర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. తాన్యా చౌద‌రి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. తన ఫ్యాన్స్ డిమాండ్ కోసమే ఈ వీడియో చేస్తున్నానంటూ తాన్యా.. తన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పింక్ అండ్ ఎల్లో డ్రెస్‌లో తాన్యా వేసిన డ్యాన్స్ మూమెంట్స్ యువతను హీటెక్కించేలా ఉన్నాయి. వీడియోలో తాన్యాను చూస్తుంటే.. తమన్నానే మరిచిపోయామంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు కుర్రకారు. కాగా.. ఈ వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా 1.4 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి.

ఇక రిలీజై మూడు వారాలు కావొస్తున్నా.. జైలర్‌ హవానే నడుస్తుంది. సూపర్ స్టార్‌ ర్యాంపేజ్‌ పాన్‌ ఇండియా లెవల్లో సాగుతుంది. కేవలం రజనీ స్క్రీన్‌ ప్రజెన్స్‌, అనిరుధ్‌ మ్యూజిక్‌.. ఈ రెండు సూపర్‌ హిట్ సినిమాను బంపర్‌ హిట్ చేసేశాయి. ఇక ఇదిలా ఉంటే జైలర్‌ మూవీ రూ.600 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తమిళంలో ఈ మార్క్‌ అందుకున్న రెండో సినిమాగా జైలర్‌ నిలిచింది. తొలిస్థానంలో రోబో 2.o ఉంది. రోబో సీక్వెల్ ఈ రికార్డును పది రోజుల్లో అందుకోగా.. జైలర్‌ 18రోజుల్లో సాధించింది. ఈ సినిమాలో శివరాజ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చారు. వీళ్ల ఎంట్రీకి ఆడియెన్స్‌ ఈలలు, గోలలతో థియేటర్‌లు దద్దరిల్లేలా చేశారు.


Tags:    

Similar News