‘ఆదిపురుష్.. అసలు రామాయణమే కాదు.. అదో కల్పిత కథ’: రచయిత

Update: 2023-06-18 07:50 GMT

ఆదిపురుష్ సినిమా రిలీజ్‌కు ముందు ఎలాంటి నెగెటివిటీ ఎదుర్కుందో.. రిలీజయ్యాక అంత కంటే ఎక్కువ నెగెటివిటీని ఎదుర్కొంటుంది. ‘అసలు ఇది రామాయణం ఇతిహాసమేనా, గొప్ప కథను చెత్తగా చూపించారంటూ’ విమర్శిస్తున్నారు. డైలాగ్స్, మేకింగ్, సీన్స్ ఇలా ప్రతి ఒక్కటి.. రామాయణ కథకు విరుద్ధంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ టీవీ ఛానెల్ చర్చా వేదికలో మాట్లాడిన ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘ఆదిపురుష్ అసలు రామాయణ కథనే కాదు. మేము రామాయణాన్ని ఇన్పిరేషన్ గా తీసుకుని రాసుకున్న కల్పిత కథ. కల్పిత కథ కాబట్టే ఇలా ఉంది. అయినా సినిమా విడుదల ముందు డిస్ క్లైమర్ లో ఆ విషయాలన్నీ వేశాం. ప్రస్తుత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తీశాం. అంతే కానీ మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాలి. చూసుకుని విమర్శించాలంటూ’ చెప్పుకొచ్చారు. అయితే, ‘సినిమా విడుదలకు ముందు.. ఇది రామాయణ గాధగానే ప్రచారం చేశారు. పాటలు, సన్ని వేశాలన్నీ రామాయణంకు తగ్గట్టుగానే ఉన్నాయి. రిలీజ్ కాకముందు ఒక మాట. అయ్యాక ఒక మాట మాట్లాడటం ఏంట’ని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News