కమనీయం కొమురవెల్లి మల్లన్న కల్యాణం

Update: 2024-01-07 15:59 GMT

కొమురవెల్లి మల్లన్న కల్యాణం కమనీయంగా జరిగింది. ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం మల్లికార్జునస్వామి బలిజ మేడాలమ్మ, గొల్లకేతమ్మలను పెళ్లాడాడు. ఉజ్జయిని పీఠాధిపతులు శ్రీ 1008 జగద్గురు సిద్ధలింగరాజదేశి కేంద్ర శివాచార్య మహా స్వామీజీ పర్యవేక్షణలో మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.కొమురవెల్లి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద కన్నులపండువగా జరిగిన ఈ వేడుకను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.




Tags:    

Similar News