పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో.. ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. బతకడానికి దొంగతనాలకు, దోపిడీలకు సైతం తెగపడుతున్నారు అక్కడి జనాలు. ప్రజలకు నిత్యావసరాలే కరువయ్యాయి. కొందాం అనుకున్నా దొరకని పరిస్థితి ఉంది. ప్రజలకు పనులు లేక ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో పలువురు చోరీలకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బక్రీద్ వేళ మేకలు, గొర్రెల దొంగతనాలు పెరిగిపోవడం.. అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో తెలియజేస్తోంది.
బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం ఆచారం. అయితే మేకలు, గొర్రెల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో మేకలు, గొర్రెలు, పశువుల దొంగతానికి గురయ్యాయంటూ గత కొంతకాలంగా కంప్లైంట్ లు వస్తున్న్నట్టుగా సమాచారం. అమ్మకాలకోసం పశులను తీసుకు వెళుతున్న వారిని బెదిరించి, జీవాలను అపహరిస్తున్నారంటూ ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజుల కిందట లారీలో మేకలు తీసుకువెళుతుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లారీడ్రైవర్ ను తుపాకీతో బెదిరించి మేకలను తీసుకెళ్లారు.
మరోచోట ట్రాలీలో తీసుకెళుతున్న మేకల్లోని ఓ మేకను.. ఓ వ్యక్తి చడిచప్పుడు కాకుండా దొంగిలించి.. ప్రయాణిస్తున్న ట్రాలీ నుంచే దూకేశాడు. ఆ వెనకే బైక్ పై వచ్చిన వ్యక్తి సాయంతో మేకతో సహ అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు. వారిద్దరి వద్ద ఆయుధాలు ఉండడంతో ఆ వ్యాన్ డ్రైవర్ ఎదురుతిరగలేక చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు షాహీన్స్ పేరిట ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
Goat🐐 kidnapp!ng in "film style" in Pakistan😂😂 pic.twitter.com/5ZytmCi9sp
— Bharat Ojha🗨 (@Bharatojha03) June 25, 2023