బంగారం షాక్.. ఎంత పెరిగిందంటే..

Update: 2023-07-08 11:19 GMT

బంగారం ధరలు అస్థిరంగా కొనసాగుతున్నాయి. భారీగా పెరిగి అంతే భారీగా పడిపోతూ వస్తున్న ధరలు శనివారం పుంజుకున్నాయి. మరింత తగ్గితే తులమో, అరు తులమో కొందామనుకునే సామాన్యులకు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు కొంటే మేలని కొందరు, ఉన్న బంగారాన్ని ఎప్పుడు అమ్మేస్తే మేలని కొందరు తర్జన భర్జన పడుతున్నాయి.

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 కేరట్ల ఆభరణాల బంగరం పది గ్రాములకు రూ. 400 పెరిగి రూ 54,550కు చేరుకుంది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం రూ.440 పెరిగి రూ. 59,510 వద్ద స్థిరపడింది. ఇక వెండి కేజీ ధర రూ. 1, 000 పెరిగి రూ. 76,700 చేరుకుంది. కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న ధరలు దాదాపు రూ. 500 పెరుగుదల నమోదు చేయడంతో ట్రెండ్ రివర్స్ అయింది. అయితే గత నాలుగు నెలల సగటుతో పోలిస్తే తాజా ధరలు తక్కువే అని చెప్పొచ్చు. షేర్ మార్కెట్లు పుంజుకోవడం, అమెరికా, బ్రిటన్ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచడం వలంటి పరిణామాలతో ధరలు నిన్నటివరకు కాస్త స్థిరంగానే సాగాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు, పండగలు కూడా లేకపోవడంతో డిమాండ్ తగ్గింది.

Tags:    

Similar News