థాయ్లో చికోటీ ప్రవీణ్ కుమార్కు బెయిల్

Update: 2023-05-02 12:30 GMT

క్యాసినో కేసులో థాయ్లాండ్లో అరెస్ట్ అయిన చికోటి ప్రవీణ్ కుమార్కు బెయిల్ లభించింది. ప్రవీణ్ కుమార్తో సహా 83 మందికి థాయ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం అతడికి 4500 రూపాయల ఫైన్ విధించింది. బెయిల్ రావడంతో రేపటివరకు చికోటి ఇండియాకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తన అరెస్ట్ పై చికోటి ప్రవీణ్ స్పందించారు. థాయ్‌లాండ్‌లో పోకర్ నిషేధమని తనకు తెలియదని.. తాను హాల్‌లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందని చెప్పారు. తాను ఆర్గనైజర్‌ను కాదని.. తన పేరు ఎక్కడా లేదన్నారు. దేవ్, సీతా తనకు ఆహ్వానం పంపారని చెప్పారు. నాలుగు రోజులు పోకర్ టోర్నమెంట్ ఉందని చెబితే వెళ్లానన్న చికోటి. పోకర్ టోర్నమెంట్ లీగల్ అని వారు తనకు చెప్పినట్లు తెలిపారు.



కాగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ ను సోమవారం థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పటాయలో 90 మంది ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికోటి ప్రవీణ్ తో పాటు మాధవ రెడ్డి, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి కూడా ఉన్నారు. పటాయా టాస్క్ ఫోర్స్‌ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ముఠా యత్నించగా వెంబడించి మరీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టైన వారిలో 14 మంది మహిళలు కూడా ఉన్నారు.

Tags:    

Similar News