ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన కార్యాలయానికి వచ్చినట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. రేంజ్ రోవర్ కారుకు టీజీ 09 0666 నంబర్‌ను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెల్లడించారు.
కాగా అల్లు అర్జున్ రవాణాశాఖ కార్యాలయానికి రావడం చూసిన కార్యాలయ సిబ్బంది, సహా తమ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.విదేశీ రోడ్డులో చక్కర్లు కొట్టేందుకు అల్లు అర్జున్.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేస్తున్నారు. ఇందుకోసమే ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. రూల్స్ ప్రకారం లైసెన్స్ కోసం చేయవల్సిన ప్రోసిజర్ ని ఆఫీసర్స్ ని కనుకొని అల్లు అర్జున్ పూర్తి చేసారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.