హీరోయిన్ సురభికి తప్పిన పెను ప్రమాదం

Byline :  Vamshi
Update: 2024-03-19 12:18 GMT

ప్రముఖ హీరోయిన్ సురభికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఫ్లైట్ కంట్రోల్ తప్పి కింద పడబోయింది. కానీ పైలెట్ చాకచక్యంగాా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించారు. ఈ విషయాన్ని సురభి ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ.. చావు నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చింది. నేను విమానంలో ప్రయాణిస్తుండగా ఎప్పుడూ జరగని సంఘటన ఎదురైంది. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను.

నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఫ్లైట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. నాతో పాటు ఫ్లైట్ లో ఉన్నవాళ్ళంతా చాలా భయపడ్డారు. కానీ పైలెట్ జాగ్రత్త వల్ల సురక్షితంగా ల్యాండ్ చేశారు. కానీ కొన్ని గంటల తర్వాత పైలెట్ సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ చేశారు. ఆ ఘటనని ఊహించుకుంటేనే భయంగా ఉంది. చావు నుంచి తప్పించుకున్నాను. జస్ట్ మిస్. ఇలా జరగడంతో నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు మరింత నమ్మకం పెరిగింది’ అని సురభి రాసుకొచ్చింది. టాలీవుడ్‌లో బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది సురభి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది

Tags:    

Similar News