Prashanth Varma : రామ మందిరానికి 'హనుమాన్' డైరెక్టర్ విరాళం.. ఎంతంటే?
అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా 'హనుమాన్' మూవీతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ వర్మ కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ కు హనుమాన్ మూవీ టీమ్ తరఫున రూ.14 లక్షల విరాళం ప్రకటించారు. తమ మూవీ రిలీజ్ కాకముందే హనుమాన్ మూవీకి సంబంధించిన ప్రతి టికెట్ మీద రామ మందిర్ ట్రస్ట్ కు రూ.5 విరాళం ఇస్తామని చెప్పామని అన్నారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పారని పేర్కొన్నారు. రామ మందిరం నిర్మాణం మొదలైనప్పుడే తమ నిర్మాత ట్రస్ట్ కు విరాళం ఇద్దామని అనుకున్నారని, సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రతి టికెట్ మీద రూ.5 డొనేట్ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం సినిమా మంచి వసూళ్లు రాబడుతోందని, శ్రీరాముడి దయతో నిర్మాత మరింత విరాళం ఇస్తారని ఆశిస్తున్నా అని అన్నారు.