రణ్బీర్, అలియా కూతురు ఎంత క్యూట్ గా ఉందో..!

Update: 2023-12-25 10:35 GMT

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్ నటించిన ఎనిమల్ మూవీ ఇటీవల రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తాజాగా తమ ఫ్యాన్స్ ఆనందాన్ని డబుల్ చేశారు రణ్బీర్, అలియా. తమ గారాల పట్టి రాహా కపూర్ తో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది.. ఆ ఫోటోలను చేసిన ఈ బాలీవుడ్ పవర్ కపుల్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. రాహా కపూర్ కళ్లు అచ్ఛం అలియా లాగా ఉన్నాయని, ఇక ఆ చిన్నారి ముఖం తాత రిషి కపూర్ లాగా ఉందని ప్రశంసలు గుప్పిస్తున్నారు. కాగా చాలా ఏళ్లుగా ప్రేమించుకున్న రణ్బీర్ , అలియా.. 2022, ఏప్రిల్ 14న హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వారికి 2022 నవంబర్ లో కుమార్తె రాహా పుట్టింది.




Tags:    

Similar News