RGV : 'కుర్చీ మడతబెట్టి' అంటే ఏంటో తెలుసా?: చంద్రబాబుకు ఆర్జీవీ బేతాళ ప్రశ్న
ఏపీ రాజకీయాల్లో 'కుర్చీ మడతబెట్టి' అనే డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. మామూలు నేతల నుంచి సాక్షాత్తు మాజీ సీఎం చంద్రబాబు వరకు అందరూ ఈ డైలాగ్ ను విరివిగా వాడేస్తున్నారు. ఇటీవల ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఏపీ సీఎం జగన్ చొక్కా చేతులు మడతబెట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఆ డైలాగ్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు "మీరు చొక్కాలు మడతబెడితే మేం కుర్చీలు మడతబెడతాం" అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే డైలాగ్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వాడారు. కాగా చంద్రబాబు 'కుర్చీ మడతబెడతాం' అన్న డైలాగ్ కు తాజాగా ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు.
కుర్చీ మడతబెట్టి... అనే బూతుకి అర్థం అసలు CBN కి తెలుసా అనేది నా బేతాళ ప్రశ్న ??? అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ వేశారు. అయితే ఆర్జీవీ పోస్టుకు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆర్జీవీ నువ్వు బూతుల గురించి మాట్లాడితే ఆ బూతే సిగ్గు పడుతుందని ఒకరు కామెంట్ చేస్తే.. ఇక్కడెవడో బూతు గురించి మాట్లాడుతున్నాడే అని మరొకరు కామెంట్ చేశారు. 'నీ సినిమాలో సగం మడతబెడుతున్నారు గా అదే' అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.